కోల్‌సిటీ(రామగుండం): నగరాన్ని విద్య, వైద్య, వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. న గరంలోని 38వ డివిజన్ సీతానగర్‌లో మంగళ వారం నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడారు. బొందల గడ్డగా మారిన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేసి అద్భుతంగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు నెలకంటి రాము, యుగేందర్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): ప్రజల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. కార్పొరేషన్ ఒకటో డివిజన్‌లోని మేడిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ మడిపల్లి విజయ–మల్లేశ్‌తో కలిసి భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రతీపేద కుటుంబానికి అండగా ఉంటామన్నారు.


