92 మందికి ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

92 మందికి ఉద్యోగాలు

Mar 11 2026 7:21 AM | Updated on Mar 11 2026 7:21 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో మంథని జేఎన్టీయూలో ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రాం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. తొలివిడతలో 100 మందిని ఎంపిక చేసి 20 వారాల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో 8 మందికి వేరే ఉద్యోగాలు రాగా, మిగిలిన 92 మందికి ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రాం కింద ఉద్యోగాలు వచ్చాయి. వారికి మంత్రి బుధవారం నియామక పత్రాలు అందిస్తారు.

– విష్ణువర్ధన్‌, ప్రిన్సిపాల్‌, మంథని జేఎన్టీయూ

విద్యార్థులు.. ఉద్యోగులుగా

విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్లేస్‌మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రామ్‌ డిజైన్‌ చేశాం. కంపెనీలు, విద్యార్థులకు మధ్య అంతరం తగ్గించడం దీని లక్ష్యం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణ, నగర ప్రాంత విద్యార్థులతో పోటీపడేలా సాంకేతిక నైపుణ్యం అందించడం ధ్యేయం. అందుకే పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలోని మంథని జేఎన్టీయూను ఎంపిక చేశాం. శిక్షణ పూర్తిచేసుకోని వివిధ ఉద్యోగాలకు విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. – డి.శ్రీధర్‌బాబు, ఐటీ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement