నీటి మట్టం.. ఆందోళనకరం | - | Sakshi
Sakshi News home page

నీటి మట్టం.. ఆందోళనకరం

Mar 10 2026 7:16 AM | Updated on Mar 10 2026 7:16 AM

5.18 మీటర్ల లోతులో భూగర్భ జలవనరులు ఎండలు ముదరకముందే ప్రమాద హెచ్చరికలు ఎడాపెడా బోర్లు వేయడమే కారణమంటున్న నిపుణులు

సాక్షి పెద్దపల్లి: ఎండలు పూర్తిస్థాయిలో ఇంకా ముదరనేలేదు. అప్పుడే జిల్లాలో భూగర్భ జల మట్టం పడిపోతోంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 2.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు పండిస్తున్నారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో వరి దా దాపు 2 లక్షల ఎకరాల్లో ఉంది. సుమారు 80 వేల ఎకరాలకుపైగా వరి బోర్లకిందే సాగువతోంది. పంట ప్రస్తుతం కీలకదశలో ఉంది. ఈ సమయంలో నీటి వినియోగం అధికంగా ఉంటుంది. దీనిదృష్యా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. బోర్లపై ఆధారపడి వరి సాగు చేస్తున్న రైతులు ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లుతున్నారు. ఫిబ్రవరి తొలివారం వరకు వరి నాట్లు పడడంతోపాటు మొగిపురుగు ఆశించడంతో కొందరు రైతులు రెండోసారి వరినాట్లు వేశారు. కా నీ నెలాఖరునాటికి భూగర్భ జలాలు పడిపోతుండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు భూగర్భ జలాలు పడిపోవడం.. మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో చివరిదశకు చేరిన వరి పంటకు సాగునీరు అందే పరిస్థితి కని పించకపోవడంతో ఈసీజన్‌లో గట్టెక్కేదెలా? అన్ని రైతులు తలలు పట్టుకుంటున్నారు.

రెడ్‌జోన్‌లో ఆరు గ్రామాలు..

జిల్లాలో 263 గ్రామ పంచాయతీలుండగా, అందు లో ప్రధానంగా మంథని మండలంలోని ఆరు గ్రా మాలు రెడ్‌జోన్‌కి వెళ్లాయి. ఇందులో ఎక్లాస్‌పూర్‌, సెర్వపల్లి, మల్లారం, నాగేపల్లి, అమ్మగారిపల్లి, ఖానాపూర్‌ ఉన్నాయి. ఈ గ్రామాల్లో కొత్తగా బోర్ల ఏర్పాటును నిషేధించారు. ఇక్కడ మితిమీరిన భూగర్భ జలాల వినియోగం ఉన్నందున రెడ్‌జోన్‌లోకి చేర్చామని అధికారులు వివరిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 100 మీటర్ల నీటిసౌకర్యం ఉన్నా.. కొందరు ముందస్తు జాగ్రత్తల పేరిట 150 మీటర్ల అంతకంటే ఎక్కువ లోతుకు బోర్లు వేస్తుండం పడిపోతున్న నీటిమట్టానికి కారణమంటున్నారు.

రిగ్గులపై ఉక్కుపాదం మోపితేనే..

జిల్లాలో అనుమతి లేకుండానే ఏటా ఎండాకాలం ఆరంభంలో రిగ్గులతో విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. అధికారులు ఆకస్మిక తనిఖీలతో రిగ్గులను పట్టుకుని సీజ్‌ చేస్తున్నా దందా ఆగడంలేదు. విచ్చలవిడి బోర్లను కట్టడి చేయడం, నీటిపొదుపు పద్ధతుల్ని పాటించడం, ఈ దిశగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా వేసవిలో నీటి సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలు ముదిరితే నీటిమటం మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతం తాగునీటికి ఇబ్బంది లేదు.

జిల్లాలో భూగర్భ జలమట్టం(మీటర్లలో)

అక్టోబర్‌ 3.90

నవంబర్‌ 3.83

డిసెంబర్‌ 4.49

జనవరి 4.94

ఫిబ్రవరి 5.18

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement