కోర్టు ఆవరణలో అన్నదానం | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఆవరణలో అన్నదానం

Mar 10 2026 7:16 AM | Updated on Mar 10 2026 7:16 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం అన్నదానం చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చినవారి ఆకలిని తీర్చేందుకు ప్రతీసోమవారం కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేయాలని జిల్లా జడ్జి కుంచాల సు నీత నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఏజీపీ ఉప్పు రాజు సహకారంతో సోమవారం ఈ కా ర్యక్రమం ప్రారంభించారు. జడ్జి పలువురికి భోజనం వడ్డించారు. అన్నదానం ఎంతోపుణ్యకార్యమని, ఆకలితో ఉన్నవారికి భోజనం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని జడ్జి అన్నారు.

నేటినుంచి మంత్రి పర్యటన

మంథని: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈనెల 10, 11వ తేదీల్లో మంథని డివి జన్‌లో పర్యటిస్తారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ పాలకవర్గ స మావేశం, విజయోత్సవ స భలో పాల్గొంటారు. ఈనె ల 11న పెద్దపల్లి రాధాకృష్ణ ఫంక్షన్‌హాల్‌లో చేపట్టే ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో పాల్గొంటారు. మంథని మండలం గుమ్నూర్‌లో నిర్మించిన నూతన పంచాయతీ భవనం ప్రారంభిస్తారు. గుమ్నూర్‌ నుంచి కాకర్లపల్లి మధ్య చేపట్టే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. మంథనిలోని మసీద్‌ వద్ద ప్రభుత్వం చేపట్టిన ఇఫ్తార్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రామగిరి మండలం సెంటనరీకాలనీ జేఎన్టీ యూ వార్షికోత్సవంలో మంత్రి పాల్గొంటారు. టీసీఎస్‌ ద్వారా ఉచిత శిక్షణ పొందిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తారు. ఈమేరకు మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

లేబర్‌ కోడ్‌లతో పారదర్శకత

గోదావరిఖని: పారదర్శక ఉద్యోగ వ్యవస్థ కోసం కొత్త లేబర్‌కోడ్‌లు ఎంతగానో అవసరమని డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్ర ల్‌) బిస్వ భూషణ్‌ పృష్టి అన్నారు. ఆర్జీ–1 జీ ఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబ ర్‌ కోడ్‌లుగా రూపొందంచడం ద్వారా సరైన మార్గదర్శకాలు లభిస్తాయని అన్నారు. కార్మికుల సంక్షేమం, హక్కులు, భద్రత, వేతన నిర్మాణం, పారదర్శక ఉద్యోగ వ్యవస్థ కోసం ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. ఏసీఎంవో అంబిక, జీడీకే–5 ఓసీపీ ఆఫీసర్‌ రమేశ్‌, సివిల్‌ డీజీఎం వరప్రసాద్‌, ఎక్స్‌ప్లోరేషన్‌ డీజీఎం రమేశ్‌, పర్సనల్‌ మేనేజర్‌ రవీందర్‌రెడ్డి, ప్రతినిధులు నాగుల వేణు, ఫిరోజ్‌ఖాన్‌, హన్మంతరావు, వీరారెడ్డి పాల్గొన్నారు.

27న శ్రీరామ నవమి

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో ఈనెల 27వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈమేరకు ప్రచార పోస్టర్‌ను సోమవారం హిందూవాహిని జిల్లా ఉపాధ్యక్షుడు ఉయ్యంకార్‌ సాయికుమా ర్‌, ప్రముఖ వ్యాపారి బాల్‌కిషన్‌ జాకోటియా తదితరులు ఆవిష్కరించారు. సుమారు పదివేల మందితో శోభాయాత్ర నిర్వహిస్తామని వారు తెలిపారు. లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణమహారాజ్‌, ప్రముఖ నటి కరాటే కల్యాణి హాజరవుతారని పేర్కొన్నారు. నాయకులు సురేశ్‌, వరప్రసాద్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌, రామ్మూర్తి, సంపత్‌, శ్రీకాంత్‌, దేవీశంకర్‌, శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement