కోల్‌సిటీ(రామగుండం): చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావా లని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బల్దియా కా ర్యాలయం వద్ద సోమవారం 5 కే రన్‌ను మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించా రు. రన్ ప్రధాన చౌరస్తా వరకు చేరుకుంది. ఎమ్మె ల్యే మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత, పచ్చద నం పెంపొందించడం లక్ష్యమన్నారు. ప్రస్తుతం న గర పునర్నిర్మాణం శరవేగంగా సాగుతోందని, వచ్చే రెండేళ్లలో అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంద న్నారు. మేయర్ మాట్లాడుతూ, పాలకవర్గం పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డి ప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతో పాటు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ న వీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీడీపీవో అలేఖ్య పటేల్, సీఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.


