పాలకుర్తి(రామగుండం): పాలకుర్తి మండలం జ య్యారం, పెద్దపల్లి మండలం కురుమపల్లి గ్రామస్తులు కంకర, బోల్డర్ తరలించే లారీలను సోమవా రం అడ్డుకున్నారు. కన్నాల బోడగుట్ట క్వారీకి అను మతి లేదని మైనింగ్ అధికారులు బండ వెలికితీత ను కొద్దిరోజుల క్రితం నిలిపివేశారు. దీంతో కన్నాల క్రషర్లకు పాలకుర్తి మండలం జయ్యారం, ధర్మారం మండలం రచ్చపల్లి క్వారీలతోపాటు నందిమేడా రం పంప్‌హౌస్‌కు నిత్యం వందల లారీల ద్వారా కంకర, బోల్టర్ సరఫరా అవుతోంది. దీనికితోడు జా తీయ రహదారి నిర్మాణం కోసం వందల ట్రిప్పుల కంకర తరలిస్తున్నారు. అతివేగం, ఓవర్‌లోడ్‌తో రా కపోకలు సాగిస్తుండగా.. దుమ్ము, ధూళి లేస్తోందని, రోడ్డు గుంతలు పడుతోదని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి రూర ల్ పోలీసులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామ ని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


