రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
రామగుండం మేయర్ మహంకాళి స్వామి
జ్యోతినగర్(రామగుండం): రామగుండం నగరాన్ని సుందరీకరించడంలో అందరూ భాగస్వాములు కావాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డులో ఆదివారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం చేపట్టారు. పరిసరాలు, ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోడ్లపై చెత్త వేస్తే రూ.500 వరకు జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. తొలిసారి ఎన్టీపీసీకి వచ్చిన మేయర్‌ను మాజీ కౌన్సిలర్ మా మిడాల చంద్రయ్య శాలువా కప్పి సన్మానించారు. కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
టిఫిన్ టేస్టీ..
మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, అధికారులు, పారిశుధ్య సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. టిఫిన్ చాలా టేస్టీగా ఉందని మేయర్ అన్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.


