నవతరానికి నవ్యశ్రీ నాంది | - | Sakshi
Sakshi News home page

నవతరానికి నవ్యశ్రీ నాంది

Mar 8 2026 7:18 AM | Updated on Mar 8 2026 7:18 AM

● భూగర్భ గనిలో మహిళా ఇంజినీర్‌ సత్తా ● నేడు నారీశ్రమశక్తి అవార్డు అందుకోనున్న ఉద్యోగిని

● భూగర్భ గనిలో మహిళా ఇంజినీర్‌ సత్తా ● నేడు నారీశ్రమశక్తి అవార్డు అందుకోనున్న ఉద్యోగిని

గోదావరిఖని: భూగర్భగనిలో కూడా సత్తా చాటుతూ తామేమీ తక్కువ కా దని నిరూపిస్తున్నారని సింగరేణి మ హిళా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ అల్లం న వ్యశ్రీ. రెండేళ్ల క్రితం భూగర్భగని ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టారు. పు రుషులతో సమానంగా బొగ్గు ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నారు. ఆమె కృషిని గుర్తించిన సింగరేణి యాజమాన్యం.. కేంద్రప్రభుత్వం అందించే నారీ శ్రమశక్తి అవార్డుకు సిఫారసు చేయగా పురస్కారాని కి ఎంపికయ్యారు. 2009 డిసెంబర్‌ 9న మైనింగ్‌గ్రాడ్యుయేట్‌ ట్రెయినీగా ఉద్యోగంలో చేరిన ఆమె.. గ తేడాది డిసెంబర్‌లో ఫస్ట్‌క్లాస్‌ మేనేజర్‌గా పదోన్నతి సాధించారు. 21రోజుల పాటు మైన్స్‌రెస్క్యూ ట్రెయినీ బ్రిగేడియర్‌గా ప్రత్యేక శిక్షణ పొందారు.

జీడీకే–11 భూగర్భగనిలో..

రామగుండం డివిజన్‌–1 పరిధి జీడీకే–11గనిలో కంటిన్యూయస్‌ మైనర్‌పై ఫస్ట్‌షిఫ్ట్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు నవ్యశ్రీ. జనరల్‌ షిఫ్ట్‌ సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులతో సహా సుమారు 200 మందికి ఆమె పనులు కేటాయిస్తూ భేష్‌ అనిపించుకుటున్నారు. యంత్రాలు, భద్రత, స్ట్రాటా పర్యవేక్షణ, ఉత్పత్తి, ఉత్పాదకత, గ్యాస్‌ డిటెక్షన్‌ తదితర పనుల్లో ముందుకు సాగుతున్నారు. 2019 నుంచి 2024 వరకు భూగర్భ బొగ్గు గనుల్లో వివిధ స్థాయిల్లో సుమారు 5ఏళ్లపాటు వెస్ట్‌బెంగాల్‌లోని గెయిన్‌వెల్‌ కమోసేల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పనిచేసిన అనుభవం ఇక్కడ ఉపయోగపడుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కోల్‌కత్తాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నుంచి ఆమె నారీ శ్రమశక్తి అవార్డు అందుకోనున్నారు.

బాధ్యత మరింత పెరిగింది

మాది కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కిష్టంపేట్‌. మా నాన్న వ్యవసాయం చేస్తారు. కొత్తగూడెం కేఎస్‌ఎం కాలేజీలో మైనింగ్‌ ఇంజినీర్‌ పూర్తిచేశా. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవార్డుతో మరింత బాధ్యాత పెరిగింది. భవిష్యత్‌లో మరింత కష్టపడి సింగరేణి అభివృద్ధిలో నా పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తా. అవార్డుకు ఎంపిక చేసిన ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌కు ధన్యవాధాలు.

– నవ్యశ్రీ, భూగర్భగని

మైనింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement