కోల్‌సిటీ(రామగుండం): నగర మేయర్ మహంకాళి స్వామి చీపురు పట్టి రహదారులు శుభ్రంచేశారు. తొలుత ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ మార్కండేయకాలనీలో నాలాపూడిక తీత పరిశీలించారు. అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లుసాగి సంతోష్‌రావు, మేకల సమ్మయ్య, మేకల శారద, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సుడిగాలి పర్యటన
రామగుండం: కలెక్టర్ కోయ శ్రీహర్ష పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. స్కూళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
రామగుండం జెడ్పీ హైస్కూల్‌లో కలెక్టర్ శ్రీహర్ష
చీపురుతో రహదారి శుభ్రం చేస్తున్న మేయర్


