పెద్దపల్లి: సమస్యలు పరిష్కరించడంలో జిల్లా టీఎన్జీవో ఆదర్శంగా నిలుస్తోందని అదనపు కలెక్టర్ వే ణు అన్నారు. కలెక్టరేట్ ఎదుట శనివారం ముందస్తు మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఉద్యోగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతినిధులు బొంకూరి శంకర్, వేణుగోపాల్, ప్రవీ ణ్‌రెడ్డి, శారద, కాళిందిని, సురేశ్, శ్రీనివాస్, అయిరెడ్డి సందీప్‌రెడ్డి, కొమురయ్య, మహేందర్‌రెడ్డి, శిల్ప, సౌమ్య, రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్, జగన్, సంపత్, రాజీరెడ్డి, ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు.
నేడు బాలికలకు టీకా
పెద్దపల్లి: జిల్లాలోని 14 నుంచి 15ఏళ్ల మధ్య వ యసు కలిగిన బాలికలకు ఆదివారం హెచ్‌పీవీ టీ కా వేస్తారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈమేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, డీసీహెచ్ శ్రీధర్, టీవీవీపీ ఆస్పత్రుల ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, కిరణ్ కుమార్, చిన్నపిల్లల వైద్యనిపుణులు రవీందర్, నరేశ్, శరత్ కుమార్, శివాణి, స్టాటిస్టికల్ అధికారి సాలమ్మ, వీసీ సీఎం అఖిల శనివారం సమీక్షించారు.


