పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్: మ హిళల ఆర్థికాభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి పనిచే స్తున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిల్ల మల్ల య్య అధ్యక్షతన శనివారం జరిగిన మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం 26 మంది దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేశారు. సుల్తానాబాద్ మండలం అల్లీపూర్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, వైస్‌చైర్మన్ మస్కాన్ నాజ్ నయ్యర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


