మలబార్‌లో బ్రైడల్‌ జ్యువెలరీ షో | - | Sakshi
Sakshi News home page

మలబార్‌లో బ్రైడల్‌ జ్యువెలరీ షో

Mar 7 2026 7:20 AM | Updated on Mar 7 2026 7:20 AM

● భుక్యా సక్కుబాయికి రజతం, కాంస్యం

కరీంనగర్‌: నగరంలోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ షోరూంలో ఈనెల 7 నుంచి 16 వరకు బ్రైడల్‌ జువెలరీ షో నిర్వహించనున్నారు. ఈ జువెలరీ షోను శుక్రవారం కరీంనగర్‌ జిల్లా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ ఆకుల శైలజ ప్రారంభించారు. ఈ షోలో సంస్కతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నవవధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యతతో తయారు చేయబడి జీవిత కాలం మన్నికతో ఉండే ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేల్స్‌ మేనేజర్‌ సోహెల్‌ సిద్ధాంత్‌, మార్కెటింగ్‌ శ్రీనివాస్‌, విక్కీ తదితరులు పాల్గొన్నారు.

పారాగేమ్స్‌లో గిరిజన బిడ్డ ప్రతిభ

వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం జవహర్‌లాల్‌తండాకు చెందిన దివ్యాంగురాలు భూక్య సక్కుబాయి పారా అథ్లెట్‌ జాతీయస్థాయిలో సత్తాచాటారు. ఇటీవల నిర్వహించిన సెకండ్‌ ఎడిషన్‌ చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సక్కుబాయి ప్రతిభ కనబర్చి రెండు పతకాలు కై వసం చేసుకుంది. మార్చి 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన క్రీడాపోటీల్లో సక్కుబాయి తన ప్రతిభను చాటారు. షార్ట్‌పుట్‌ విభాగంలో ఆమె రజతం సాధించగా, డిస్కస్‌ త్రోలో కాంస్యం గెలుసుకుంది.

ఎల్‌ఎండీలో మత్స్యకారుడు మృతి

కొత్తపల్లి(కరీంనగర్‌): మానేరు డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లిన పెసరు జంపయ్య(35) ప్రమాదవశాత్తు డ్యాంలో పడి మృతి చెందినట్లు కొత్తపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బిల్ల కోటేశ్వర్‌ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల మేరకు కరీంనగర్‌లోని రాంచంద్రాపూర్‌ కాలనీ చెందిన జంపయ్య ఈ నెల 5వ తేదీన మానేరు డ్యాంలో చేపలు పట్టేందుకు తెప్పపై వెళ్లగా గాలి వేగానికి ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకొని నీటిలో పడిపోయాడు. తోటి మత్స్యకారులు రాజు, స్వామిలు గమనించి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ నీటిలో మునిగిపోయాడు. నీటిలో మునిగిన జంపయ్య శవం శుక్రవారం కనిపించగా..మృతురాలి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement