మంథనిరూరల్: ఆరెంద మానేరుపై హైలెవల్ వంతెన మంజూరైంది. ఈ నేపథ్యంలో భట్టు పల్లి ప్రధాన రహదారిపై వాహన లోడ్‌పై సర్వే చేపట్టారు. మానేరుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి గతడిసెంబర్‌లో ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో వంతెన, రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఆరెంద నుంచి జయశంకర్ భూపాలపల్లి జి ల్లా దామెరకుంట వరకు 1.120 కి.మీ. పొడువున, 13 మీటర్ల వెడల్పుతోపాటు 9.530 కి. మీ. పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీతో సర్వే చేపట్టింది. హైలెవల్ వంతెన, 9 కి.మీ. మేర రోడ్డు నిర్మి స్తున్న క్రమంలో ఎంతలోడ్‌తో వాహనాల రాకపోకలు సాగుతాయనే దానిపై సర్వే చేశారు.
సింగరేణి సీఎండీ రాక
గోదావరిఖని: సింగరేణి సీ ఎండీ బుద్ధప్రకాశ్‌జ్యోతి త్వరలో రామగుండం రీజియన్‌లో పర్యటించనున్నా రు. ఈమేరకు అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 12న సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బుద్దప్రకాశ్.. ఏ రియాల వారీగా పర్యటించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో శుక్రవారం కొత్తగూడెం లో పర్యటించారు. కార్మికులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో ఉద్యోగులను ఉత్పత్తి, ఉత్పాదకతలో కార్యోణ్ముకులను చే యడంతోపాటు సంస్థ స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.
‘పార్కింగ్’ కోసం టెండర్లు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్‌లో రెండోపార్కింగ్ స్టాండ్ నిర్వహణకు అధికారులు ఎట్టకేలకు టెండర్లు ఆహ్వానించారు. తనకు గి ట్టుబాటు కావడం లేదని ఓ కాంట్రాక్టర్ పార్కింగ్ స్టాండ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీనిపై ‘గిట్టుబాటు లేక.. నిరుపయోగంగా వదిలేసి’ శీర్షికన గతనెల 11వ తేదీన ‘సాక్షి’కథనం ప్ర చురించింది. దీంతో రైల్వేశాఖ స్పందించి ఈనెల 9వ తేదీ నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నామని ప్రకటించింది. ఈమేరకు అధికారు లు నోటిఫికేషన్ జారీ చేశారు.
విధులకు ‘రాంరాం’
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రం పరిధిలోని ఆశ కార్యకర్తలు విధులకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పీహెచ్‌సీ అధికారులకు శుక్రవారం వి నతిపత్రం ఇచ్చారు. కొలనూర్, కనగర్తి, ఉప్ప రపల్లె, గోపరపల్లె, హరిపురంలోని ఆశకార్యక ర్తలకు జనవరి, ఫిబ్రవరి వేతనాలు మంజూరు కాలేదు. దీంతో తాము ఇక విధులకు హాజరు కాలేమంటూ ప్రకటించారు. కార్యక్రమంలో ప ర్శ మణింద్ర, పర్శ సరిత, జి.లలిత, కె.ప్రేమలత, మమత, సీహెచ్ లక్ష్మి పాల్గొన్నారు.


