కలెక్టర్ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హెల్త్ ప్రొఫైల్ తయారీపై కార్యాచరణ రాఘవాపూర్‌లో ప్రజాపాలన.. ప్రగతిప్రణాళిక షురూ
పెద్దపల్లిరూరల్: మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇందిరా మహిళాశక్తి సంఘం సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రాఘవాపూర్‌లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి శుక్రవారం ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక ప్రారంభించారు. తొలుత గ్రామ స్తులకు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారి కి మందులు అందజేశారు. జిల్లాలో ఇందిరా మహిళాశక్తి సంఘం సభ్యులుగా ఉన్న లక్షా 20వేల మందికి ఆరోగ్యపరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూ పొందించామన్నారు. ఎమ్మెల్యే విజయరమణారా వు మాట్లాడుతూ, కల్తీనూనెలతో క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలుతోందన్నారు. బీపీ, షుగర్‌లాంటి వ్యాధులకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తారని తెలిపారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, వైద్యాధికారి మమత, రాఘవాపూర్, రంగాపూర్, అప్పన్నపేట సర్పంచులు తాడిచెట్టి చామంతి, గంట రమేశ్, ఆరె సంతోష్, నాయకులు తాడిచెట్టి శ్రీకాంత్, ఆడెపు వెంకటేశ్, ముడుసు సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్యం మెరుగుపర్చాలి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో పారిశుధ్యం మెరుగుపర్చడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పాలకమండలి పట్టణ అభివృద్ధి కోసం పనిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. చైర్మన్ సూగిల్ల మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్‌తో కలిసి ఆయన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో పాల్గొని పలు సూచనలు చేశారు. 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. వైస్‌చైర్‌పర్సన్ మస్కాన్‌నాజ్ నయ్యర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కనీస విద్యాప్రమాణాలు అందించాలి
ప్రతీ విద్యార్థికి కనీస విద్యాప్రమాణాలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ పనితీరుపై అధికారులతో కలిసి సమీక్షించారు. డీఈవో శారద, అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ తదితరులు పాల్గొన్నారు.


