నగర అభివృద్ధికి నిధులివ్వండి | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధికి నిధులివ్వండి

Mar 7 2026 7:19 AM | Updated on Mar 7 2026 7:19 AM

● రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి

● రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చాలని మేయర్‌ మహంకాళి స్వామి మంత్రులను కోరారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ఉమ్మడి జిల్లా ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి తు మ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం సన్నాహాక సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ తో కలిసి మహంకాళి స్వామి హాజరయ్యారు. శుక్రవారం నుంచి నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్ర ణాళిక 99 రోజుల కార్యాచరణలో రామగుండం న గరపాలక సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలను మే యర్‌ సమావేశంలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించామని మహంకాళి స్వామి అన్నారు.

నవ్యశ్రీకి ‘నారీ శ్రమశక్తి’

గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తిలో విశేష కృషి చేసిన మహిళా ఇంజినీర్‌ నవ్యశ్రీ నారీ శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 8న జరిగే అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శా ఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి నుంచి ఆమె అవార్డు అందుకోనున్నారు. ఆర్జీ –వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ శుక్ర వారం నవ్యశ్రీని అభినందించారు. మైన్స్‌ మేనేజర్‌ సర్టిఫికెట్‌తో రెస్క్యూ శిక్షణ పొంది జీడీకే–11గనిలోని కంటిన్యూయస్‌ మైనర్‌ విభాగంలో ఉత్పత్తి కోసం కీలకపాత్రపోషించారన్నారు. ప్రతీషిఫ్ట్‌లో దాదాపు 300 టన్నుల బొగ్గు ఉత్పత్తితోపాటు అక్కడ పనిచేస్తున్న 40మందిని ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారన్నారు. భూగర్భగనిలో పురుషులతో సమానంగా పనిచేసి యంత్రాలు, భద్రత, స్ట్రాటా పర్యవేక్షణ, ఉత్పత్తి, ఉత్పాదకత, గ్యాస్‌ డిటెక్షన్‌ తదితర అంశాల్లో నవ్యశ్రీ అప్రమత్తంగా ఉన్నారని జీఎం ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement