రామగుండం: అంతర్గాం మండలం ఎగ్లాస్‌పూర్ గ్రా మానికి చెందిన కారాపూరి లావణ్య –నర్సయ్య దంపతులు. వీరికి సొంతిల్లు లే దు. అనేక ఏళ్లుగా అద్దె ఇంట్లో ఆర్థిక సమస్యలతో నెట్టుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ పథకం ద్వారా లావణ్య – నర్సయ్యకు ఇల్లు మంజూరైంది. దీంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండాపోయాయి. ఇంటినిర్మాణం పూర్తిచేసు కుని శుక్రవారం గృహ ప్రవేశం చేశారు. సర్పంచ్, ఉప సర్పంచులు జూపాక మమ త, లగిశెట్టి రాకేశ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేశారు. గ్రామస్తులూ అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకుడు బర్పటి తిరుపతికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి రమేశ్, గ్రామస్తులు కట్కూరి శంకర్, జూపాక శ్రీనివాస్, బర్పటి చొక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రులను తరచూ తనిఖీ చేయాలి
పెద్దపల్లి: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. క్లినిక్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ –2010పై తన చాంబర్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రులను క్రమంతప్పకుండా తనిఖీ చేయాలన్నారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేశ్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ఐఎంఏ కార్యదర్శి ప్రణీత్ పాల్గొన్నారు.


