గోదావరిఖని: సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని, మారుపేర్ల డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక భాస్కర్‌రావుభవన్‌లో యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం గురువా రం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, నవంబ ర్ 2024, మార్చి 2025లో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలు డిమాండ్‌లను అంగీకరించిన సింగరేణి యాజమాన్యం.. ఇప్పటికీ అమలు చే యడం లేదన్నారు. సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌కంట్యాంక్స్ చెల్లింపులపై ఉత్తర్వులు జారీచేయడం లేదని, అనారోగ్యంతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడిచినా కార్మికులను పిలవడం లేదని దుయ్యబట్టారు. సమ్మెలో పా ల్గొన్న కాంట్రాక్టు కార్మికుల జీతంలో కోత విధిస్తా మని యాజమాన్యం ఆదేశాలు జారీచేసిందని, దాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. కొత్త గనులు కేటాయించకుండా సింగరేణిని నీరుగార్చడం సరికాదన్నారు. మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్ మెన్ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మైకెనా సిద్ధమేనని వారు హెచ్చరించారు. నాయకులు మిర్యాల రంగయ్య, కె.సారయ్య, వైవీ రావు, ముస్కె సమ్మయ్య, మడ్డి ఎల్లాగౌడ్, కె.వీరభద్రం, అక్బర్‌అలీ, కవ్వంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, బాజీసైదా, మల్లికార్జున్, రాంగోపాల్, రమేశ్, తిరుపతి, మల్లేశ్, జిగురు రవీందర్, ఎంఆర్‌సీ రెడ్డి, రంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


