కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్/రామగుండం: వచ్చేఏడాది జూన్‌లో నిర్వహించే గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఎ మ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆదేశాల మేరకు డీపీఆర్ త యారు చేయనున్నట్లు రామగుండం మేయర్ మ హంకాళి స్వామి తెలిపారు. గోదావరిఖని పుష్కర ఘాట్‌తో పాటు మల్కాపూర్ శివారు, సింగరేణి ఇన్‌టెక్‌వెల్, గోలివాడ, జనగామ తదితర చోట్ల గోదావరినదీ తీరాన్ని మున్సిపల్, నీటి పారుదల ఇంజినీ ర్లు, కార్పొరేటర్లు, కన్సల్టన్సీ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ఏర్పాట్ల కు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతకుముందు పుష్కరఘాట్‌ల నిర్మాణంపై ఎస్‌కే కన్సల్టెన్సీ రూపొందించిన మ్యాప్‌ను మేయర్ పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పుష్కరాలకు వస్తారని, వారికి అసౌకర్యం కలుగకుండా సకాలంలో పనులు ప్రారంభించి పూ ర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారని అన్నారు. డి ప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతోపాటు సూపరింటెండింగ్ ఇంజినీర్ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, డీఈఈలు షాభాజ్, జమీల్, చంద్రమౌళి, టీపీఎస్ నవీన్, నీటి పారుదలశాఖ డీఈ శరత్ బాబు, నాయకులు సింగరేణి శ్రీనివాస్, ఎస్‌కే కన్సల్టెన్సీ ప్రతినిధి రంగారెడ్డి తదితరులు ఉన్నారు.


