సీఐపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సీఐపై చర్యలు తీసుకోవాలి

Mar 6 2026 8:28 AM | Updated on Mar 6 2026 8:28 AM

గోదావరిఖనిటౌన్‌: గోదావరిఖనికి చెందిన న్యా యవాది మార్కాపురం తిలక్‌ను అవమానించిన గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డిని సస్పెండ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక కోర్టు సమీపంలో లాయర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబి రాన్ని గురువారం ఆయన సందర్శించి సంఘీ భావం ప్రకటించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ, న్యాయవాదులకే రక్షణ లేకుంటే సా మాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. లా యర్ల నిరసనను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోరా? అని నిలదీశారు. ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని సీఐ తో న్యాయవాదులకు క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తౌటం స తీశ్‌, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్‌ కుమార్‌, ప్రతినిధులు గోపాల్‌రెడ్డి, పంగా శంకర్‌, రాగం శ్రీధర్‌, శోభ, పులిపాక రాజ్‌కుమార్‌, శ్రీలత, గొ ర్రె రమేశ్‌, బల్మూరి అమరేందర్‌రావు, చక్రపాణి, రమేశ్‌, పెట్టం శ్రీనివాస్‌, ముచ్చకుర్తి కుమార్‌, ఎంచర్ల మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement