మంథని: యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పట్టణంలో బుధవారం ఆయన విస్త్రతంగా పర్యటించారు. గంగాపురిలోని ప్రభుత్వ స్థలం, గౌతమినగర్ ప్రాథమిక పాఠశాల, టాస్క్ భవనం పరిశీలించారు. ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టీజీఐఐసీ ఆధ్వర్యంలో గార్మెట్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రెండెకరాలు కేటాయిస్తోందని ఆయన అన్నారు. టాస్క్ ద్వారా యువతకు మంచి శిక్షణ అందించేందుకు మంథనిలో ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అవసరమైతే మరో భవనంలోకి కూడా విస్తరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ అరీఫొద్దీన్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే చేరాలి
పెద్దపల్లి: ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలని కలెక్టర్ శ్రీహ ర్ష సూచించారు. పెద్దకల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాల ప్ర చార పోస్టర్‌ను ఆయన తన కార్యాలయంలో ఆవి ష్కరించి మాట్లాడారు. ప్రిన్సిపల్ కె.లక్ష్మీనర్సయ్య, అధ్యాపకులు సతీశ్‌కుమార్, పురుషోత్తం, మారుతి, మురళి, షుకుర్, నారాయణ తదితరులు పాల్గొన్నా రు. కాగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలి
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్‌లో చేపట్టిన మహిళా సంఘ భవనం పనులను కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈనెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలి
పెద్దపల్లి: గ్రామీణాభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. 99 రోజుల కార్యాచరణ అమలుపై తన కార్యాలయంలో ఎంపీడీవోలతో ఆయన సమీక్షించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


