ధర్మారం(ధర్మపురి): ప్రజల మద్దతుతో గెలిపిన ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో చేపట్టిన వార్డుసభ్యుల శిక్షణ శిబి రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం 38 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.38,4408 విలువైన చెక్కులు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. గ్రామాల్లో సదుపాయాలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవచూపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కటికెనపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, దొంగతుర్తి శ్రీలక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, సర్పంచులు దాగేటి రాజేశ్వరి, చేపూరి లచ్చయ్య, కొడారి మంగ, ట్రస్టు చైర్మన్ దాగేటి ఉదయ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుమలత, ఎంపీవో రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, రామడుగు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


