పెద్దపల్లిరూరల్: మంథని మాజీఎమ్మెల్యే, ఉ మ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జ యంతి సోమవారం స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాల య ప్రాంతంలోని గాంధీ విగ్రహం వద్ద జరుపుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి: మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయ సా ధనకు కృషిచేయాలని ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా సుల్తానాబాద్‌లో కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, మార్కెట్ క మిటీ చైర్మన్లు మినూపాల ప్రకాశ్‌రావు, కూర మ ల్లారెడ్డితోపాటు సతీశ్ తదదితరులు ఉన్నారు.
వసతుల కల్పనకు ప్రాధాన్యం
జూలపల్లి(పెద్దపల్లి): వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాచాపూర్ – లోకపేట డబుల్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ తదితరులు ఉన్నారు.
రాహుల్‌తో ఎమ్మెల్యే భేటీ
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ దంపతులు సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన జిల్లాల అధ్యక్షులు, పట్ట ణ అధ్యక్షులకు వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమానికి రాహు ల్‌గాంధీ హాజరయ్యారు. ఈసందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఆయనకు స్వాగతం పలికారు.
సిబ్బందికి పెర్ఫార్మెన్స్ అవార్డు
పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని సిబ్బందికి స్టార్ పెర్ఫార్మెన్స్ అవార్డును డీసీహెచ్ శ్రీధ ర్ అందజేశారు. ప్రతీనెల సిబ్బంది పనితీరు ఆ ధారంగా ఈ అవార్డు ఇవ్వాలనే కలెక్టర్ ఆదేశాలమేరకు సోమవారం ఈ పురస్కారం అందజేశారు. మార్చినెలకు గాను ఎన్.మాధవి, బి. విజయ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్‌ఎంవో విజయ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మట్టిపాత్రలతో ఆరోగ్యం
జ్యోతినగర్(రామగుండం): నేషనల్ గ్రీన్ కా ర్ప్స్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన మట్టికుండల తయారీ –వాటితో కలిగే లాభాలు తదితర అంశాలపై ఎన్టీ పీసీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చా రు. జిల్లా మానిటరింగ్ అధికారి పీఎం షేక్ ఆ ధ్వర్యంలో మట్టిపాత్రల ప్రాధాన్యత గురించి వివరించారు. హెచ్‌ఎం జయరాజు, ఎంఈవో జింక మల్లేశం, ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్ అంజ న్‌కుమార్, నాగపురి రాజేంద్రప్రసాద్, కోడూరి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, స్వర్ణల త, అనురాధ, రమేశ్, శ్రీధర్ పాల్గొన్నారు.
నేడు ఓదెల మల్లన్న ఆలయం మూసివేత
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేస్తామని ఈవో సదయ్య తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బుధవారం వేకువజామున సంప్రోక్షణ అనంతరం తిరిగి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు.
క్వింటాల్ పత్తి రూ.7,391
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 7,391 ధర పలికింది. కనిష్టంగా రూ.5,657, సగటు రూ.7,012గా నమోదైందని మార్కెట్ క మిటీ చైర్మన్ కె.మల్లారెడ్డి తెలిపారు. 605 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.


