పెద్దపల్లి: మహనీయుల జీవితాల నుంచి మనం అ నేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో సోమవా రం మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చిన శ్రీపాదరావు.. సర్పంచ్ నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. కార్యక్రమంలో డీసీపీ రాంరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాల్లో చెరగని ముద్ర
గోదావరిఖని: రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన మహనీయుడు శ్రీపాదరావు అని రామగుండం పోలీస్‌కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మా జీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని సోమ వారం కమిషనరేట్‌లో నిర్వహించారు. శ్రీపాద చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీపాదరావు శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్)శ్రీనివాస్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు రమేశ్, శ్రీనివాస్, ప్రతాప్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


