ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యం

Mar 3 2026 7:26 AM | Updated on Mar 3 2026 7:26 AM

● సమస్యలు సత్వరమే పరిష్కరించాలి ● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: ప్రజల నుంచి అర్జీల రూపంలో అందే సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావా ణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి కలెక్టర్‌ దరఖాస్తులు స్వీకరించారు. మంథని మండలం ఎక్లాస్‌పూ ర్‌ గ్రామానికి చెందిన పి.ఓదెలు.. తనకు ఖానా పూర్‌ శివారులోని సర్వే నంబర్‌ 48/38లో వారస త్వంగా వచ్చిన ఎకరం ఉందని, తన తండ్రి పేరిట ఉన్న పట్టాను తన పేరిట మార్చాలని దరఖాస్తు చే శాడు. పెద్దపల్లి తిలక్‌నగర్‌కు చెందిన బి.శ్యామల.. తనకు డబుల్‌బెడ్రూమ్‌ ఇల్లు మంజూరు చేయాలని, రంగంపల్లికి చెందిన కె.కవిత.. తమకు దివ్యాంగుల కోటాలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు మంజూరుచేయాలని, పెద్దపల్లికి చెందిన బానోతు రాజేశ్‌ నాయక్‌.. సీఎం కప్‌ క్రీడాపోటీల్లో తన కుమారుడు బానోతు రెడ్యానాయక్‌కు గాయమైందని, చికిత్స కోసం ఆర్థికసాయం చేయాలని దరఖాస్తు చేశారు. వీటిని పరిశీలించిన కలెక్టర్‌.. పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా తో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షించారు. 2027 జూన్‌ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి మహాపుష్కరాలు జరుగుతాయని కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, లైటింగ్‌, పార్కింగ్‌, తదితర ఏర్పాట్లు చేయాలని, ఆలయాల అభివృద్ధి చేపట్టాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. గోలివాడ, మంథని, గోదావరిఖని, సుందిళ్ల వంటి ప్రాంతాలల్లో ప్రవాహం అధికంగా ఉంటుందని, అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డీసీపీ రాంరెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఈ భావ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement