జెండా కూడలిలో..
పెద్దపల్లిరూరల్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి కాముని దహనం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జెండా కూడలి వద్ద విశ్వహిందూ పరిషత్, దేవిడి సమీపంలో మార్వాడీ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ‘హోలీ కాదహనం’ నిర్వహించారు. ప్రధాన కూడలిలో కట్టెలు పేర్చి ఉపయోగంలో లేనివస్తువులను వేసి దహనం చేశారు. చెడు, అసూయ, అహంకారం మంటల్లో కాలిబూడిదవుతాయని అర్చకులు తెలిపారు. హోలికా రాక్షసి మరణం తర్వాత పరస్పరం రంగులు చల్లుకుని సంబురాలు జరుపుకుంటారని అర్చకుడు కొండపాక శ్రీనివాసాచార్యులు తెలిపారు.


