పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యా ర్డులో వసతుల కల్పనకు రూ.4 కోట్లతో ప్రతిపాదించగా, రూ.1.29కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించిందని మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 2026–27 వార్షిక బడ్జెట్‌ను రూ.8కోట్ల అంచనాతో ప్రతిపాదించారు. రైతుల కోసం పబ్లిక్‌టాయిలెట్లు నిర్మించాలని ఇందులో నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.21 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఈఏడాది ఫిబ్రవరి నాటికి రూ.6.66కోట్లు సమకూరిందని గ్రేడ్ కార్యదర్శి సతీశ్ తెలిపారు. ఈ మార్చి చివరివరకు లక్ష్యం అధిగమిస్తామని ఆయన అన్నారు. డైరెక్టర్లు ఎడ్ల మహేందర్, మ్యాడగోని శ్రీనివాస్, కొమ్ము కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


