ప్రశ్నిస్తున్న మానవత్వం
గోదావరిఖని మార్కండేయకాలనీలో ఆస్తికోసం చిన్నాన్న కుటుంబంపైనే ఓ వ్యక్తి కొబ్బరిబొండాం కట్‌చేసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.
కాల్వశ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్ – పద్మ భార్యాభర్తలు. వీరిమధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో ఈనెల 20న పెద్దపల్లి కోర్టుకు హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో పెద్దపల్లి బస్టాండ్ నుంచి పద్మను నమ్మించి వెంట తీసుకెళ్లాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట మైసమ్మ గుడి సమీపంలో తీవ్రంగా కొట్టి బండరాయితో తలపై మోదాడు. చనిపోయిందని భావించి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా కొనఊపిరితో కనిపించిన పద్మను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈనెల 21న
గోదావరిఖని: చిన్నకారణాలు మనుషుల మధ్య కక్షలు పెంచుతున్నాయి. సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా.. హత్యాయత్నాలు, హత్యలకూ దారి తీస్తున్నాయి. జిల్లాలో కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు మానవతావాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నిండు జీవితాలు బలి..
క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్నయాలతో వందే ళ్లపాటు జీవించాల్సిన జీవితాలు అర్ధంతరంగా ము గుస్తున్నాయి. కొందరు ప్రత్యర్థులపై కత్తులతో దా డులు చేస్తూ పగ తీర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి హత్యలు, కొన్ని ఆత్మహత్యలు అనేక కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. బాధిత కుటుంబాలు పెద్దదిక్కును కో ల్పోయి తీరని వేదనకు గురవుతున్నా యి. నిందితుల కుటుంబాలు కూడా స మాజ చిన్నచూపులకు గురవుతున్నాయి. పోలీసుల విచారణ, కేసులు, జైలు జీవితం, నడవడిక తదితర ప్రభావాలు కు టుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇలాంటి నేర ఘటనల్లో యువత భాగస్వామ్యమే అధికంగా ఉంటోందని పోలీసులు చెబుతున్నారు.
ప్రత్యేక కౌన్సెలింగ్‌తోనే సరి..
నేరాల్లో యువత భాగస్వామ్యం ఉండకూడదన్న లక్ష్యంతో పోలీసుశాఖ ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తోంది. యువత, విద్యార్థులకు సామాజిక మాధ్యమాలతో ఎదురువుతున్న ఇబ్బందులు, గంజాయి వినియోగం, విక్రయాలతో తలెత్తే సమస్యలపై వివరిస్తోంది. ఇదేసమయంలో మానవ సంబంధాలపైనా సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. మహిళలకు కూడా కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, నేరాలు తదితర అసాంఘిక ఘటనల వైపు దృష్టి మళ్లకుండా వివరిస్తోంది.
ఈనెల 20న
నమ్మించి.. వెంట తీసుకెళ్లి..
జిల్లాలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు
ఘటనలు 2024 2025 2026(ఇప్పటివరకు)
హత్యలు 17 14 02
హత్యాయత్నం 51 30 02
ప్రశ్నిస్తున్న మానవత్వం


