నేటినుంచి చెక్కులు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి చెక్కులు పంపిణీ

Feb 23 2026 6:52 AM | Updated on Feb 23 2026 6:52 AM

నేటిన

నేటినుంచి చెక్కులు పంపిణీ

మంథని: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న అనేక మందికి సీఎం సహాయ నిధి ద్వారా ఆపన్నహస్తం అందిస్తున్నారు. మంథనిలోని మంత్రి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి శ్రీధర్‌బా బు.. సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు మంజూరు చేయిస్తున్నారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, పాలకుర్తి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మహదేవపూర్‌, మల్హర్‌, పలిమెల తదితర మండలాల్లోని 266 మంది బాధితులకు రూ.1.09 కోట్లు మంజూరు చేయించారు. వీ టిని సోమవారం నుంచి బాధితుల ఇళ్లకువెళ్లి అందిస్తామని, అందుబాటులో లేనివారు మంత్రి క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని కార్యాలయ పీఏ ఆకుల చంద్రశేఖర్‌ తెలిపారు.

జాతీయ పోటీలకు ఎంపిక

సుల్తానాబాద్‌రూరల్‌: జాతీ యస్థాయి సబ్‌ జూనియర్‌ వాలీబాల్‌ పోటీలకు గర్రెపల్లి గురుకుల సాంఘిక సంక్షే మ విద్యాలయంలోని తొ మ్మిదో తరగతి విద్యార్థిని స్నిగ్ధిత ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ మంజుల తెలిపారు. నిజామాబాద్‌ ఇటీవల జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు పే ర్కొన్నారు. ఈనెల 24 నుంచి మార్చి ఒకటో తే దీ వరకు కోల్‌కత్తాలో జరిగే జాతీయస్థాయి పో టీలకు హాజరవుతుందన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ ధనలక్ష్మి, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ సృజన, సతీశ్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

జాతర ఆహ్వానపత్రిక అందజేత

జ్యోతినగర్‌(రామగుండం): మొర్మూర్‌ కొమురన్న జాతరకు హాజరు కావాలని కోరుతూ మ ల్లికార్జునస్వామి దేవస్థానం ఆహ్వాన కమిటీ కా ర్యనిర్వాహకుడు గోపు ఐలయ్య యాదవ్‌ కోరా రు. ఈమేరకు ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో ని అతిథి గృహంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ స భ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌ను ఆదివారం కలుసుకున్నారు. జాతర ఆహ్వాన పత్రిక అందజేశారు. తొలుత ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈనెల 27 నుంచి మార్చి ఒకటో తే దీ వరకు అంతర్గాం మండలం మొర్మూర్‌లో ని ర్వహించే శ్రీమల్లికార్జునస్వామి విగ్రహ ప్రతి ష్ఠ, కల్యాణోత్సవానికి హాజరుకావాలని విన్నవించారు. కార్యక్రమంలో ప్రతినిధులు కొమురయ్య, కిశోర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

ఈహెచ్‌ఎస్‌పై ఆక్షేపణలు

పెద్దపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆమోద యోగ్యమైన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) అమలు చేయాలని పీఆర్టీయూ టీఎస్‌ పు నర్నిర్మాణ రాష్ట్ర కన్వీనర్‌ కర్రు సురేశ్‌ డిమాండ్‌ చేశారు. త్వరలో అమలుచేసే ఎంప్లాయీస్‌ హె ల్త్‌ స్కీంలోని ప్రతిపాదనలపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ఆక్షేపణలు వస్తున్నాయని, వీటిని సరిచేసి అందరికీ ఆమోదయోగ్యమైనట్లు అమలు చేయాలని ఆయన కోరారు.

అమెరికాలో త్రీడీచిత్రం

మంథని: త్రీడీ కళలో ప్రపంచ స్థాయిలో ప్ర తిభ కనబర్చుతున్న మంథనికి చెందిన సింగా రపు కృష్ణ.. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఏటా చేపట్టే లేక్‌ వర్క్‌ బీచ్‌ స్ట్రీచ్‌ పెయింటింగ్‌ ఫెస్టివల్‌కూ ఈసారి కూడా హాజరయ్యారు. ఆయా దేశాల నుంచి 850 మంది కళాకారులు పాల్గొంటున్నారు. ఇందులో మనదేశం నుంచి కృష్ణ కూడా పాల్గొన్నారు. టాప్‌ 50లో కృష్ణను ఎంపిక చేయగా.. తొలిరోజు మహాభారతంలో మయసభలో ప్రస్థావించిన మాయకొలను చిత్రం వేయడం అబ్బురపర్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతున్న త్రీడీ చిత్రాలు మన మహాభారతంలోనివేనని, అందుకే మాయకొలను చిత్రీకరించినట్లు కృష్ణ తెలిపారు.

నేటినుంచి చెక్కులు పంపిణీ 1
1/3

నేటినుంచి చెక్కులు పంపిణీ

నేటినుంచి చెక్కులు పంపిణీ 2
2/3

నేటినుంచి చెక్కులు పంపిణీ

నేటినుంచి చెక్కులు పంపిణీ 3
3/3

నేటినుంచి చెక్కులు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement