పేదరికం.. అధిక సంతానం | - | Sakshi
Sakshi News home page

పేదరికం.. అధిక సంతానం

Feb 23 2026 6:52 AM | Updated on Feb 23 2026 6:52 AM

పేదరికం.. అధిక సంతానం

పేదరికం.. అధిక సంతానం

● పిల్లలులేని దంపతులకు విక్రయం ● మధ్యవర్తుల ద్వారా శిశువుల బేరం ● కాల్వశ్రీరాంపూర్‌ ఘటనలో వెలుగులోకి అనేక అంశాలు

పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్‌: పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు శిశువిక్రయాల దందా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం తొలుత సంతానం లేనిదంపతులతో బేరం కుదుర్చుకుంటున్నారు. ఆ త ర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలను తీసుకెళ్తున్నా రు. వివిధ జిల్లాల నుంచి మనజిల్లాకు వచ్చి అప్పు డే పుట్టిన పిల్లలను మధ్యవర్తులు కొనుగోలుచేసి తీసుకెళ్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని కొంద రు పేదరికం, అధిక సంతానం తదితర కారణాల తో బాధపడుతున్నారు. ఇలాంటివారి కుటుంబాల్లో గర్భం ధరించేవారిని మధ్యవర్తులు తొలుత ఎంపికచేసుకుంటున్నారు. గర్భధారణ నుంచి డెలివరీ వరకు ఖర్చంతా తామే భరిస్తామని గర్భిణులతో ఒప్పందం చేసుకుని దందా సాగిస్తున్నారు. జిల్లాలో ని కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లి, కా ల్వశ్రీరాంపూర్‌లో ఇలాంటి కుటుంబాలు కొన్ని నివాసం ఉంటున్నాయని సమాచారం.

మగపిల్లలకు ప్రాధాన్యం

సంతానం లేనిదంపతులు ఆడపిల్లల కన్నా మగపిల్లలనే కోరుకుంటున్నారని స్థానికులు కొందరులు చెబుతున్నారు. ఇందుకోసం ఎంతవరకైనా డబ్బులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారని సమాచారం. దీంతో మగశిశువులకే డిమాండ్‌ అధికంగా ఉందని తెలుస్తోంది.

రంగంలోకి స్పెషల్‌ బ్రాంచ్‌..

కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో ఇటీవల వెలుగుచూసిన శిశువిక్రయాలపై పోలీసులతో పాటు ఇంటలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, డబ్ల్యూసీడీవో ఆధ్వర్యంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు వివిధ వర్గాల నుంచి వివరాలు సేకరించారు. దానిపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ప్రస్తుతం జరిగిన విక్రయా లు, గతంలో ఇంకా ఏమైనా చోటుచేసుకున్నాయా? చేతులు మారిన సొమ్ము ఎంత? తదితర వివరాలతో నివేదిక రూపొందించారని తెలిసింది.

శిశువిక్రయాలపై ఉద్యోగుల పాత్ర?

కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లిలో చో టుచేసుకున్న శిశు విక్రయాల్లో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరోవైపు.. ఆరోపణలు వచ్చిన శిశువులను బాలసదన్‌కు తరలించి విచారణ చేపట్టామని చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కనకరాజు తెలిపారు. మరోవైపు.. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని శిశువుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement