ఎమ్మెల్యే అండ.. అభివృద్ధే అజెండా | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అండ.. అభివృద్ధే అజెండా

Feb 18 2026 7:28 AM | Updated on Feb 18 2026 7:28 AM

ఎమ్మె

ఎమ్మెల్యే అండ.. అభివృద్ధే అజెండా

పెద్దపల్లిరూరల్‌: ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, జిల్లా కేంద్రం అభివృద్ధికి ఇప్పటికే పక్కా ప్రణాళిక సిద్ధం చేశారని మున్సిపల్‌ కొత్త చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య అన్నారు. రూ.63కోట్ల అంచనాతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకు వసతులు కల్పించేందుకు పాటుపడతానని అన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..

‘స్వచ్ఛ’ పెద్దపల్లికి ప్రజలు సహకరించాలి

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందాం

‘సాక్షి’తో మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య

● ఇంటింటికీ తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. లీకేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం. రోడ్లు, డ్రైనేజీల పనులు పురోగతిలో ఉన్నాయి.

● ఒత్తిడి నుంచి పట్టణ ప్రజలకు ఉపశమనం పొందేందుకు ఆహ్లాదం పంచేలా పార్క్‌లు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఎమ్మెల్యే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మినీట్యాంకుబండ్‌ అందుబాటులో ఉంది.

● మురుగునీటి కాలువల నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షిస్తాం. డ్రైనేజీల్లో పూడిక పేరుకు పోకుండా చూడాలని సిబ్బందికి సూచనలిస్తాం. లోతట్టు ప్రాంతాలను గుర్తించి వానాకాలంలో మురుగు రోడ్డుపైకి చేరకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా తమ ఇళ్ల ముందున్న కాలువల్లో ప్లాస్టిక్‌ కవర్లు, చెత్త, చెదారం వేయకుండా పారిశుధ్య సిబ్బందికి అందించాలి.

● అంతర్గత రోడ్లను విస్తరిస్తాం. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ప్రజలు కూడా తమవంతుగా సహకరించాలి.

● పట్టణం ఏటేటా విస్తరిస్తోంది. శివారు ప్రాంత వాసులకు సౌకర్యాలు మరింత మెరుగుపర్చుతాం. శాంతినగర్‌ ప్రాంతంలో విద్యుత్‌ సమస్యలు ఉన్నాయి. అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతాం.

ప్రధాన కూడళ్ల సుందరీకరణపై దృష్టి సారిస్తాం. జెండా కూడలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యేతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సుభాష్‌ విగ్రహం, అమర్‌నగర్‌ కూడళ్లను ఇప్పటికే సుందరీకరించాం.

రంగంపల్లి, బందంపల్లి, చందపల్లి గ్రామాలు మున్సిపల్‌లో విలీనమయ్యాయి. అక్కడ ఇప్పటికే రోడ్లు, మురుగు నీటికాలువలు నిర్మించాం.వీధిదీపాలు ఏర్పాటు చేశాం. వసతులు మెరుగుపడ్డాయి. విలీన గ్రామాలకు పట్టణశోభ కల్పిస్తాం.

ఎమ్మెల్యే అండ.. అభివృద్ధే అజెండా 1
1/1

ఎమ్మెల్యే అండ.. అభివృద్ధే అజెండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement