‘నేనే అధ్యక్షుడిని’ | - | Sakshi
Sakshi News home page

‘నేనే అధ్యక్షుడిని’

Feb 18 2026 7:28 AM | Updated on Feb 18 2026 7:28 AM

‘నేనే

‘నేనే అధ్యక్షుడిని’

పెద్దపల్లి: ఎన్నికలు జరిగేంత వరకూ పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని న్యాయవాది లకిడి భాస్కర్‌ అన్నా రు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొంద రు సీనియర్‌ న్యాయవాదుల ప్రోద్బలంతో ని బంధనలకు విరుద్ధంగా తనను సస్పెండ్‌ చేశా రని ఆయన ఆరోపించారు. కోర్టు భవన నిర్మాణాల కోసం రాఘవాపూర్‌ శివారులో కేటా యించిన స్థలం విషయంలో తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ పెద్దపల్లి బార్‌ అసోసియే షన్‌ నుంచి ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడం, అధ్యక్ష పదవి నుంచి తొలిగించడం శోచనీయమన్నారు. అయితే, తన విన్నపం మేరకు తన నే అధ్యక్షుడిగా కొనసాగిస్తూ హైకోర్టు ఈనెల 11న తీర్పు ఇచ్చిందని వివరించారు. పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ సభ్యులు గౌరీశెట్టి సత్యనా రాయణ, పుట్ట రవి, దోనేటి కిష్టయ్య, వంగల రవీందర్‌, కోండ్ర నారాయణ, బుర్ల వంశీకృష్ణ, ఠాకూర్‌ రఘువీర్‌సింగ్‌ పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

పెద్దపల్లి: జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఇప్పటికే విద్య, వైద్య, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్‌, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ప్రభుత్వ, ప్రైవే ట్‌ కళాశాలల్లోని 10,367 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. పరీక్ష కేంద్రాల గు ర్తింపు కోసం ఎంసెట్‌ తరహాలో లొకేటర్‌ యా ప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఈనెల 11వ తేదీనే ముగిశాయి.

సమన్వయంతోనే అభివృద్ధి

పెద్దపల్లిరూరల్‌: గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, అధికారులతో సమన్వయంగా ముందుకు సాగితేనే సత్ఫలితాలు వ స్తాయని గ్రామాలు జెడ్పీ సీఈవో నరేందర్‌ అ న్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో అప్పన్నపేట, అందుగులపల్లి, భోజన్నపేట, బొంపల్లి, బ్రాహ్మణపల్లి, చీకురాయి, దేవునిపల్లి, గోప య్యపల్లి, గౌరెడ్డిపేట, గుర్రంపల్లి పంచాయతీ వార్డు సభ్యులకు మంగళవారం శిక్షణ తరగతు లు ప్రారంభించారు. ఈనెల 21వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. వార్డు సభ్యులు తమ విధులు, బాధ్యతలపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరా బంద్‌

పెద్దపల్లిరూరల్‌: పట్టణ శివారు రంగంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని విద్యుత్‌ ఫీడర్‌ మరమ్మతుల నేపథ్యంలో బుధవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

జాతీయ రహదారి పనులు అడ్డగింత

ముత్తారం(మంథని): లక్కారంలో చేపట్టిన ఎన్‌హెచ్‌ రోడ్డు పనులను నిర్వాసితులు మంగళవారం అడ్డుకున్నారు. దీంతో మెగా కంపెనీ, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా, డివిజన్‌, మండల కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగినా పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆవేదన చెందారు. తమ భూములకు పరిహారం చెల్లించాకే పనులకు అనుమతిస్తామని మెగా కంపెనీ ప్రతినిధులు, అధికారులకు నిర్వాసితులు తేల్చి చెప్పారు. తమ న్యాయం జరిగేంత వరకూ నిరసన చేపడతామని అక్కడే టెంట్‌వేసుకుని ఆందోళన చేశారు. పనులు అడ్డుకోవడంతో కాంట్రక్టర్లు, అధికారులు వెనుదిరుగారు.

‘నేనే అధ్యక్షుడిని’1
1/3

‘నేనే అధ్యక్షుడిని’

‘నేనే అధ్యక్షుడిని’2
2/3

‘నేనే అధ్యక్షుడిని’

‘నేనే అధ్యక్షుడిని’3
3/3

‘నేనే అధ్యక్షుడిని’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement