మాటే గెలిచింది | - | Sakshi
Sakshi News home page

మాటే గెలిచింది

Feb 18 2026 7:28 AM | Updated on Feb 18 2026 7:28 AM

మాటే

మాటే గెలిచింది

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎవరనే దానిపై చెలరేగిన ఉత్కంఠకు మంగళవారం తెరపడింది. చైర్మన్‌గా బిరుదు రాధాకృష్ణ, వైస్‌ చైర్‌పర్సన్‌గా అంతటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి వీరబుచ్చ య్య ప్రకటించారు. నాలుగో వార్డు కౌన్సిలర్‌ బిరుదు రాధాకృష్ణను చైర్మన్‌గా రెండోవార్డు కౌన్సిలర్‌ గాజుల రాజమల్లు బలపర్చగా, 8వ వార్డు కౌన్సిలర్‌ చింత ల రాజు ప్రతిపాదించారు. అంతటి పుష్పలతను వైస్‌చైర్‌పర్సన్‌గా ఏడోవార్డు కౌన్సిలర్‌ ఉట్ల వరప్రదీప్‌ బలపర్చగా.. టీకే ప్రభాకర్‌ ప్రతిపాదించారు. వీరుతప్ప మరెవరూ ఆ పదవుల కోసం నామినేషన్లు వేయలేదు. దీంతో వీరిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అంతకుముందు 15 మంది సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, దివంగత మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుమారుడు బిరుదు రాధాకృష్ణను మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నామన్నారు. కాగా, సో మవారం జరగాల్సిన చైర్మన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నిక.. ఏకాభిప్రాయం కుదరక మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పీఠం రాధాకృష్ణకే

వైస్‌ చైర్‌పర్సన్‌గా అంతటి పుష్పలత ఎన్నిక

మాటే గెలిచింది 1
1/2

మాటే గెలిచింది

మాటే గెలిచింది 2
2/2

మాటే గెలిచింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement