మోడల్ టౌన్‌గా మంథని
మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్
మంథని: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో మంథని పట్టణాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవంతోపాటు మున్సిపల్ చైర్మన్‌గా అందివచ్చిన అవకాశాన్ని ప్రజావసరాలు తీర్చేందుకే ఉపయోగిస్తామన్నారు. మంత్రి విడుదల చేసే రూ.కోట్ల నిధులపై సమీక్షిస్తూ అభివృద్ధి పనులు పూర్తిచేయిస్తామని తెలిపారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా మంథని మున్సిపల్ పాలకవర్గం రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నిలిచేలా పనిచేస్తామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు చేరేలా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అసంపూర్తి పనులు, సమస్యలు ఇప్పటికే గుర్తించామని, వాటిని మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకుంటామని వివరించారు. తమ గెలుపు, పదవి అప్పగించిన మంత్రి శ్రీధర్‌బాబు, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, కాంగ్రెస్ శ్రేణుల సహకారం ఎంతో గొప్పదన్నారు.
22న జగన్నాథ ఆలయానికి ఆర్టీసీ బస్సు
గోదావరిఖనిటౌన్: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షే త్రం పూరి జగన్నాథుని ఆలయం వరకు ఆర్టీసీ ప్ర త్యేక బస్సు నడిపిస్తుందని డీఎం నాగభూషణం తె లిపారు. ఈనెల 22న గోదావరిఖని బస్టాండ్ నుంచి బయలు దేరుతుందన్నారు. తిరిగి ఈనెల 28న గోదావరిఖని చేరుకుంటుందని ఆయన పేర్కొ న్నా రు. ప్రయాణంలో అన్నవరం, సింహాచలం తదితర ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుందని డీఎం వివరించారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం అన్నారు. టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం సెల్ నంబరు 70135 04982లో సంప్రదించాలని ఆయన కోరారు.


