పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు

Jan 21 2026 7:29 AM | Updated on Jan 21 2026 7:29 AM

పకడ్బ

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు

పెద్దపల్లి: రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ వేణు ఆదేశించారు. రంజాన్‌ మాసం ఏర్పాట్లపై ఆర్డీవోలు గంగయ్య, సురేశ్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. 24 గంటల పాటు హోటళ్లు తెరిచి ఉంచే అవకాశాలు పరిశీలించాలని పోలీసులకు ఆయన సూచించారు. విద్యుత్‌, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ తదితర చర్యలు చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలలో ప్రవేశాల వాల్‌పోస్టర్‌ను వేణు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి నరేశ్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, హజ్‌ కమిటీ డైరెక్టర్‌ ఫకృద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

వన్యప్రాణుల గణన షురూ

మంథనిరూరల్‌: అడవుల్లో వన్యప్రాణుల గణనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఖానాపూర్‌ శివారులోని అడవుల్లో అధికారులు మంగళవారం వన్యప్రాణుల గణన చేపట్టారు. జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య ఆధ్వర్యంలో అటవీప్రాంతంలో పర్యటించారు. ప్రతీ నాలుగేళ్ల కోసారి ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ పేరిట సర్వే నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా జిల్లాలోని మంథని, రామగిరి, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్‌ అటవీప్రాంతాల్లో సర్వే చేపట్టామని డీఎఫ్‌వో తెలిపారు. తొలుత పరిసరాలు పరిశీలిస్తామని, తర్వాత పాదముద్రలు, చెట్లకు గాట్లు, ఆనవాళ్లతో వన్యప్రాణుల లెక్కింపు చేపడతామని ఆయన అన్నారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వినయ్‌ నాయక్‌, బీట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఆదాయం పెంపుపై దృష్టి

పెద్దపల్లిరూరల్‌: స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో ఆదాయం పెంపొందించుకోవాలని డివిజనల్‌ పంచాయతీ అధికారి దేవకీదేవి కొత్త సర్పంచులకు సూచించారు. స్థానిక మదర్‌ థెరిసా ఇంజినీరింగ్‌ కాలేజీలో కొత్త పంచాయతీ సర్పంచులకు రెండోరోజు మంగళవారం జరిగిన శిక్షణ సందర్భంగా మాట్లాడా రు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించే వారు లేఅవుట్‌ నిబంధనలు పా టిస్తే కొంత ఆదాయం సమకూరుతుందన్నారు. లేఅవుట్‌ లేనిప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. ఇంటింటా సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్‌ షెడ్లకు తరలించి సేంద్రియ ఎరువు తయారీ చేయడం, వర్గీకరించి విక్రయించడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని అన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,853

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,853 ధర పలికింది. కనిష్టంగా రూ.6,808గా, సగటు రూ.7,553గా నమోదు అయ్యిందని మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. రైతుల నుంచి 438 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

24 నుంచి విరసం సభలు

పెద్దపల్లి: హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24, 25వ తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నామని విరసం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కన్వీనర్‌ బలాసాని రాజయ్య, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహా య కార్యదర్శి మాదన కుమారస్వామి తెలిపా రు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మహాసభ ప్రచార పోస్టర్‌ను మంగళవా రం విడుదల చేసి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యతిరేకత, మేధావుల నిర్బంధం, నిరసనకారులపై దాడులు వంటి చర్యలతో ప్రభుత్వం ప్రజలపై యుద్ధం చేస్తోందని ఆరోపించారు. సర్కా రు తీరును నిరసిస్తూనే మహాసభలలకు హాజరుకావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్వాడి సుదర్శన్‌, బండారి రాజలింగు, బండి శంకర్‌, శ్రీపతి రాజగోపాల్‌, నక్క సత్యనారాయణ, గుమ్మడి కొమురయ్య, కె.రాజు, కె.అంజన్న, సదానందం, ఐత బాపు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు 1
1/3

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు 2
2/3

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు 3
3/3

పకడ్బందీగా రంజాన్‌ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement