కార్మికుల భవిష్యత్‌పై చర్చిస్తాం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల భవిష్యత్‌పై చర్చిస్తాం

Jan 21 2026 6:39 AM | Updated on Jan 21 2026 6:39 AM

కార్మికుల భవిష్యత్‌పై చర్చిస్తాం

కార్మికుల భవిష్యత్‌పై చర్చిస్తాం

జ్యోతినగర్‌(రామగుండం): కార్మిక మార్కెట్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్‌ ఉద్యోగవకాశాలు, డిజిటల్‌ మార్పుల ప్రభావంపై గ్లోబల్‌ లేబర్‌ మార్కెట్‌ కాన్ఫరెన్స్‌లో సమగ్రంగా చర్చించనున్నట్లు ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్‌ కార్యదర్శి బాబర్‌ సలీంపాషా అన్నారు. ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26, 27వ తేదీల్లో సౌదీ అరేబియా రియాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సు –2026లో పాల్గొనేందుకు తనకు అవకాశం వచ్చిందన్నారు. ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు, వ్యాపార రంగ, అకడమిక్‌, కార్మికరంగ నిపుణులు హాజరై కార్మిక విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులపై విస్తృతంగా చర్చించనున్నారని అన్నారు. డిజిటలైజేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, నూతన నైపుణ్యాల అవసరం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. సమావేశంలో ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్‌, నాయకులు నేరెళ్ల రమేశ్‌, ఆరెల్లి సత్యనారాయణ, గొల్లపల్లి సత్యనారాయణ, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీ జాతీయ నేత బాబర్‌ సలీంపాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement