ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందితో.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందితో..

Jan 19 2026 4:45 AM | Updated on Jan 19 2026 4:45 AM

ప్రైవ

ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందితో..

సింగరేణిలో దొంగతనాలను అరికట్టేందుకు యాజమాన్యం సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య పెంచింది. అందులో పర్మినెంట్‌ సెక్యూరిటీగార్డుల కన్నా ప్రైవే ట్‌ సిబ్బంది సంఖ్యే అధికంగా ఉంటోంది. దీంతో సంస్థకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కుతోందని అంటున్నారు. అయితే దొంగలు చోరీ చేసేసమయంలో అడ్డుకునే వారిపై భౌతిక దాడులకు దిగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

స్క్రాప్‌ కేంద్రాలే లక్ష్యంగా..

స్క్రాప్‌ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలను దొంగలు ఎంచుకుంటున్నారు. సెక్యూరిటీ తక్కువగా ఉండడం, తమ పనిసులువుగా చేసుకునే ప్రాంతాన్ని ఎంచుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా కొంత మంది దొంగలు ఓసీపీ క్వారీల్లోకి చొరబడి భారీ యంత్రా ల కోసం వినియోగిస్తున్న త్రీకోఆర్మ్‌డ్‌ కాపర్‌కేబుల్‌ కత్తిరించుకుని వెళ్తున్నారు. కాపర్‌కేబుల్‌లోని కేబుల్‌ను కాల్చివేసి కాపర్‌ అమ్ముకుంటున్నారు. చోరీలతో భారీ యంత్రాలు నిలిచిపోతున్నాయి. దీంతోపాటు విలువైన కేబుల్‌ దొంగలపాలవుతోంది. ప్రధానంగా స్క్రాప్‌ కేంద్రాలే లక్ష్యంగా దొంగలు చోరీలకు దిగుతున్నారు. అంతేకాకుండా ఓసీపీలు, భూగర్భగనులు, సీఎస్పీలు, బేస్‌వర్క్‌షాపులు, స్టోర్స్‌ కేంద్రంగా దొంగతనాలు చేస్తున్నారు. ఈప్రాంతంలో ఎక్కువగా యంత్ర విడిభాగాలు, ఐరన్‌ స్క్రాప్‌ నిల్వ ఉండడంతో దొంగలు వీటిపై దృష్టి సారిస్తున్నారు.

నామమాత్రపు కేసులే..

సింగరేణి స్క్రాప్‌ ఎత్తుకెళ్లున్న దొంగలపై నామమాత్రపు కేసులు మాత్రమే ఉంటుండడంతో ఒకసారి చోరీకి పాల్పడి దొరికిన వారే మరోసారి పట్టుబడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రామగుండం రీజియన్‌లో తరచూ చోటుచేసుకుంటున్నాయి. కొందరిపై కేసులు, రౌడీషీట్‌ ఉన్నప్పటికి కూడా వారు మళ్లీ ఇదే తరహా చోరీలకు పాల్పడు తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

దొంగలు ధ్వంసం చేసిన ద్విచక్ర వాహనం(ఫైల్‌)

ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందితో.. 
1
1/1

ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందితో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement