సుల్తానాబాద్ అభివృద్ధికి రూ.20 కోట్లు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్‌లోని 10, 12వ వార్డుల్లో ఆదివారం రాత్రి 23 ఇందిరమ్మ ఇళ్లకు ఆయన ముగ్గు పోశారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అభివృద్ధిని విస్మరించిందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.కోట్లు వెచ్చించగా నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతోందన్నారు. ఆ ర్టీసీ బస్సు డిపో మంజూరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. సుల్తానాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయిన కార్యాలయాలను మళ్లీ తీసుకొచ్చామని గుర్తుచేశారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, ప్రతినిధులు అన్నయ్యగౌడ్, ప్రకాశ్‌రావు, మురళీధర్, ఉట్ల వర ప్రదీప్, సామల యమున, దామోదర్‌రావు, శ్రీనివాసరావు, చిలుక సతీశ్, అమీరిశెట్టి రాజలింగం, తిరుపతి, శ్రీగిరి శ్రీనివాస్, పల్లా సురేశ్, బిరుదు కృష్ణ, చింతల రాజు, తోర్రికొండ ప్రభాకర్, నన్ను, అభినవ్‌గౌడ్ పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


