ఆధునిక సాంకేతికతపై ఇల్లెందు క్లబ్‌లో సదస్సు
గోదావరిఖని: ఆధునిక సాంకేతికతపై స్థానిక ఇల్లెందు క్లబ్‌లో శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్(ఐఈఐ) సదస్సు నిర్వహించారు. గనులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు, డిజిటల్ సాంకేతికత, వ్యవసాయం వంటి విభిన్న రంగాలపై నిపుణులు అవగాహన కల్పించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మాజీ ఎమ్మెల్యే, ఇంజినీర్ సోమారపు సత్యనారాయణ, ఐఈఐ రాష్ట్ర కమిటీ చైర్మన్ రమణ నాయక్, గౌరవ కార్యదర్శి మర్రి రమేశ్, సభ్యులు కె.లక్ష్మీనారాయణ ఆర్జీ–వన్ జీఎం లలిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గనుల అక్రమ తరలింపు, ఫ్లైయాష్ నిర్వహణ, స్మార్ట్ మైనింగ్‌లో 5ఏ అడ్వాన్స్‌డ్, ‘క్రాప్ దర్పణ్’ యాప్, ఏఐ ఆధారిత పంట ఆరోగ్య నిర్ధారణ, ఎంఎండీఆర్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతిక సదస్సు జ్ఞాన మార్పిడి, వృత్తిపరమైన పరస్పర చర్యలు, విధానాలు – సాంకేతికత – సుస్థిరతపై చర్చకు వేదికగా సదస్సు నిలిచింది.


