70 పల్లెలు
నేడే రెండోవిడత పంచాయతీ ఎన్నికలు
ఉదయం 7గంటలకు ప్రారంభం
మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహణ
ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 యాక్ట్ అమలు
ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరిలివెళ్లిన సిబ్బంది
4 మండలాలు..
సాక్షి,పెద్దపల్లి/పెద్దపల్లి: జిల్లాలో రెండోవిడత పంచాయతీ సమరానికి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉద యం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌లను ఎ న్నుకుంటారు. జిల్లాలోని ధర్మారం, పాలకుర్తి, జూలపల్లి, అంతర్గాం మండలాల్లోని 70 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. శనివారం ఉదయం నుంచే ఆయా మండల కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. భద్రత బలగాలు వారివెంట తరలివెళ్లాయి.
పల్లెలు ప్రశాంతం..
శుక్రవారం వరకు ప్రచారంలో హోరెత్తిన పల్లెలు ఇప్పుడు ప్రశాంతంగా మారాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులు వారంరోజులుగా ఇంటింటా ప్రచారం చేశారు. ఊరేగింపులు, నమూనా బ్యాలెట్ పత్రాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారు. రెండోవిడతలో 73 పంచాయతీలో ఎన్నికలు జరపాల్సి ఉండగా.. బొట్లవనపర్తి, బంజేరుపల్లి, నాయకంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 సర్పంచ్ స్థానాల కు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 286 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 684 వార్డులకు 177 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 507 వార్డులకు 1,454 మంది పోటీపడుతున్నారు.
1,13,908 మంది ఓటర్లు..
రెండోవిడతలో 1,13,908 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అంతర్గాం మండలంలో 17, 930మంది, ధర్మారంలో 43,697మంది, జూలపల్లి మండలంలో 24,163 మంది, పాలకుర్తి మండలంలో 28,118 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 57,702 మంది కాగా.. మహిళలు 56,201 మంది ఉండగా.. ఇతరులు ఐదుగురు ఉన్నారు.
అమలులో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు....
ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలులో ఉండనుంది. ఓట్ల లెక్కింపు పూర్తికాగానే సాయంత్రం ఐదు గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల సమయంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం, కర్రలు, కత్తులు తదితర మారణాయుధాలతో సంచరించడాన్ని నిషేధించారు.
పల్లెబాట పట్టిన ప్రజలు
హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆయా పల్లెల ప్రజలు పోలింగ్ నేపథ్యంలో స్వగ్రామాల బాటపట్టారు. సర్పంచ్, వార్డుస్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కూడా ఓటర్ల కోసం సొంతంగా వారికి వాహనాలు సమకూర్చుతున్నారు. చివరి ప్రయత్నంగా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఓటుకు నోటు, మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ కాళ్లు మొక్కుతూ, ఒట్టు కూడా వేయించుకుంటున్నారు. అయితే, మరికొద్ది గంటల్లోనే ఎవరి భవితవ్యం ఏమిటో తేలిపోనుంది.
అధికారులు, సిబ్బంది సమాచారం
పోలింగ్ కేంద్రాలు 684
పీవోలు 787
ఏపీవోలు 1,031
రూట్లు 2
జోన్లు 12
వెబ్‌కాస్టింగ్ కేంద్రాలు 39
రెండోవిడతలో మొత్తం పంచాయతీలు 73
ఏకగ్రీవమైన సర్పంచులు 3
ఎన్నికలు జరిగేవి 70
పోటీలో ఉన్న అభ్యర్థులు 286
మొత్తం వార్డులు 684
ఏగ్రీవమైనవి 177
ఎన్నికలు జరిగేవి 507
బరిలో ఉన్నవారు 1,454
70 పల్లెలు
70 పల్లెలు


