ఏఐసీసీ నేతలు స్పందించాలి
పెద్దపల్లి: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ మన్నారాయణ శనివారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కా ర్యాలయాన్ని సందర్శించారు. జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమం ఆవశ్యకతపై ఏఐసీసీ అగ్రనేతలకు వివరించారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీ కార్యాల య కార్యదర్శికి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.
తీరని రైల్వేగేట్ కష్టాలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి – కూనారం మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్‌తో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతీ పది, ఇరవై నిముసాలకో రైలు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. తరచూ గేట్ వేయక తప్పని పరిస్థితి ఉంది. గంటల కొద్దీ నిరీక్షించలేని వాహనదారులు.. ప్రమాదం అని తెలిసినా గేట్ కిందనుంచి వాహనాలను ఇలా దాటిస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. – పెద్దపల్లిరూరల్
కొద్దిపాటి నీళ్లతోనే నారుమడులు
ఎస్సారెస్పీ కాలువ ద్వారా సరఫరా అయ్యే సాగునీటిపై ఆధారపడిన రైతులు వరి నారుమడి సిద్ధం చేసేందుకు నీటికష్టాలు తప్పడం లేదు. ఎస్సారెస్పీ కాలువ అడుగున మిగిలిన కొద్దిపాటి నీటిని సైతం తోడేందుకు విద్యుత్ మోటార్లు అమర్చుకుంటున్నారు కొందరు రైతులు. ఆ నీటితోనే నారుమడిని సిద్ధం చేసుకుంటున్నారు. రాంపల్లి గ్రామశివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద కనిపించిందీ దృశ్యం.
– పెద్దపల్లిరూరల్
రైస్‌మిల్లుల్లో ధాన్యం గుట్టలు
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఆశించిన దానికన్నా అధికంగానే పంట రైతుల చేతికి అందింది. ఐకేపీ, ప్యాక్స్‌లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. ఇలా తరలివచ్చిన ధాన్యం బస్తాలను మిల్లుల్లో నిల్వచేయగా.. గుట్టల్లా కనిపిస్తున్నాయి. సుల్తానాబాద్‌లోని మిల్లుల్లో కనిపించిన ధాన్యం బస్తాలు ఇవీ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ఏఐసీసీ నేతలు స్పందించాలి
ఏఐసీసీ నేతలు స్పందించాలి
ఏఐసీసీ నేతలు స్పందించాలి


