పోలింగ్ కేంద్రాలపై పోలీస్ ఫోకస్
17,00 మంది పోలీసులతో భారీ బందోబస్తు కమిషనరేట్ పరిధిలో 519 సమస్యాత్మక కేంద్రాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
పాతనేరస్తులపై నిఘా
గోదావరిఖని: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలపై పోలీసులు డేగకన్ను వేశా రు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో 1,680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,700 మంది పోలీసు బలగాలను మోహరించారు. 519 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
పోలీసు బందోబస్తు ఇలా
రామగుండం పోలీసు కమిషనరేట్‌లోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఇందులో ఇ ద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 30మంది సీఐ లు, 95మంది ఎస్సైలు, 270 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 520మంది కానిస్టేబుళ్లు, 240మంది హోంగార్డులు, 190మంది ఆర్ముడ్ సిబ్బంది, 32 క్యూర్‌టీ టీంలు ఉన్నాయి. వీరితోపాటు రెండు రూట్ మొ బైల్ పార్టీలు 62 ఏర్పాటు చేశారు. చెక్‌పోస్ట్‌ల్లో భ ద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా స్థానిక పోలీసులతోపాటు డయల్ 100 నంబరకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు సూచించారు.
కమిషనరేట్‌లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పాతనేరస్తుల కదలికలపై డేగకన్ను వేశాం. రూట్ మొబైల్స్, స్ట్రెకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్‌ను నియమించాం. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాం. క్రిటికల్ పోలింగ్ గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించాం.
– అంబర్ కిశోర్ ఝా,
పోలీస్ కమిషనర్, రామగుండం
పోలింగ్ కేంద్రాలపై పోలీస్ ఫోకస్


