నామినేషన్ కేంద్రాల పరిశీలన
మంథనిరూరల్/కాల్వశ్రీరాంపూర్: స్థానిక ఎన్నికల నేపధ్యంలో మంథని మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల జనరల్ పరిశీలకులు అనుగు నర్సింహరెడ్డి, వ్యయ పరిశీలకులు సుజాత పరిశీలించారు. అలాగే కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల, పెగడపల్లి, పెద్దరాతుపల్లి, కిష్టంపేట, మల్యాల, కాల్వశ్రీరాంపూర్, మంగపేట గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య సందర్శించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, డీటీ శంకర్ తదితరులున్నారు.


