ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ముత్తారం/రామగిరి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ పేర్కొన్నారు. గురువారం ముత్తారం, రామగిరి పోలీస్‌స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఠాణాల పరిధిలో రౌడీషీట్స్, హిస్టరీ షీట్స్, సస్పెక్ట్స్ షీట్స్ లిస్టును తనిఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలని, కొత్తగా రౌడీషీట్స్‌లో ఎవరైనా ఉంటే ప్రపోజల్స్ పంపించాలన్నారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని సూచించారు. ఆయన వెంట మంథని సీఐ రాజు, ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్, పురుషోత్తం దివ్య, సిబ్బంది ఉన్నారు.


