శిశు మరణాలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

శిశు మరణాలు తగ్గించాలి

Nov 28 2025 7:20 AM | Updated on Nov 28 2025 7:20 AM

శిశు

శిశు మరణాలు తగ్గించాలి

పెద్దపల్లి: శిశు మరణాలు తగ్గించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వాణిశ్రీ, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో ‘సంకల్ప్‌’ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పిల్లల వార్డులోని ఇంక్యుబేటర్లు, ఫొటోథెరపీ యూనిట్లను పరిశీలించి శిశు మరణాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బంధంపల్లి, రంగంపల్లి బస్తీ దవాఖానలను సందర్శించి ఓపీ, అటెండెన్స్‌ రిజిస్టర్లు తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ బి.శ్రీరాములు, వైద్యాధికారి లక్ష్మీభవాని, క్వాలిటీ మేనేజర్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

‘నాణ్యత లేకుండా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం’

మంథని: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మానేరు నదిపై నాణ్యత లేకుండా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం జరిగిందని, ఇందుకు నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు బాధ్యత వహించాలని టీపీసీసీ ఎన్నికల కమీషన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడు శశిభూషణ్‌ కాచే అన్నారు. గురువారం మంథనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అవినీతి కుంభకోణానికి పాల్పడిన హరీశ్‌రావుపై విజిలెన్స్‌ అధికారులు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదల వెంకన్న, కాంగ్రెస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్‌, నాయకులు శంకర్‌, మంథని సురేశ్‌, పర్షవేని మోహన్‌యాదవ్‌ పాల్గొన్నారు.

మెడికల్‌బోర్డులో కార్మికులకు అన్యాయం

గోదావరిఖని(రామగుండం): మొదటి హయ్యర్‌ మెడికల్‌ బోర్డులో 54 మందికి ఐదుగురు, రెండో మెడికల్‌ బోర్డులో 128 మందికి 25మంది మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అయ్యారని, కనీసం 20శాతం ఇన్వాలిడేషన్‌ కూడా మించలేదని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ, మెడికల్‌బోర్డులో కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేస్తుంటే మౌనంగా ఉండటాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. గతంలో రెండునెలలకో మెడికల్‌బోర్డు పెట్టించిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కిందని, 80శాతం మంది కార్మికులకు న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికై నా కార్మికులు కళ్లు తెరిచి ఐక్య కార్మిక పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపెల్లి రవి, వడ్డేపల్లి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి

ఓదెల/కాల్వశ్రీరాంపూర్‌: ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ పేర్కొన్నారు. గురువారం ఓదెల మండలం కొలనూర్‌లోని పోలింగ్‌ కేంద్రాలు, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని స్థానిక పోలీస్‌ అధికారులను ఆదేశించారు. నామినేషన్‌ ప్రక్రియ, పోలింగ్‌, కౌంటింగ్‌, ప్రచార సమయాల్లో అభ్యర్థులతోపాటు వారి మద్దతుదారులు సమన్వయంతో మొలగాలని సూచించారు. డీసీపీ వెంట సుల్తానాబాద్‌ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు రమేశ్‌, వెంకటేశ్‌, సిబ్బంది ఉన్నారు.

శిశు మరణాలు తగ్గించాలి1
1/3

శిశు మరణాలు తగ్గించాలి

శిశు మరణాలు తగ్గించాలి2
2/3

శిశు మరణాలు తగ్గించాలి

శిశు మరణాలు తగ్గించాలి3
3/3

శిశు మరణాలు తగ్గించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement