
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రామగిరి(మంథని): కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) సేవలను జాప్యం లేకుండా అందిస్తామని రీజినల్ కమిషనర్లు హరిపచౌరి, కె.గోవర్ధన్ అన్నారు. స్థానిక జీఎం కార్యాల యంలో అధికారులు, ఉద్యోగులతో ప్రయాస్ కార్యక్రమంపై మంగళవారం అంగాహన క ల్పించారు. సీఎంపీఎఫ్ లావాదేవీలన్నీ సీ–కే ర్స్ పోర్టల్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా సేవలు పొందాలని సూచించారు. ఆర్జీ–3 జీఎం సుధాకరరావు మాట్లాడుతూ, ఉద్యోగుల సీఎంపీ ఎఫ్ వివరాలను పరిశీలించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్సనల్ విభాగాధిపతి సుదర్శనం, ఫైనాన్స్ డీజీఎం సురేఖ, డీవైపీఎం సునీల్‌ప్రసాద్, సీనియర్ పీవో రాజేశం, సివిల్ అధికారి మనోజ్, సీఎంపీఎఫ్ సి బ్బంది కామేశ్వరరావు, అనిత, మనోహర్, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రం
గోదావరిఖని: స్థానిక సీఎంపీఎఫ్ కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛ పక్వాడా నిర్వహించా రు. ఈసందర్భంగా కార్యాలయం ముందున్న చెత్తను క్లీన్ చేశారు. కార్యక్రమంలో ఆర్జీ–1 ఎస్‌ఓటూ జీఎం చంద్రశేఖర్, సీఎంపీఎఫ్ కమీషన ర్ హరిపచౌరీ, కె.గోవర్థన్ పాల్గొన్నారు.
‘రైతునేస్తం’లో డీఏవో
పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాష్ట్రంలోని పలువురు రైతులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి రైతువేదిక ద్వారా జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏడీఏ శ్రీనాథ్, ఏవో అలివేణి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. క్లస్టర్ అధికారులు కల్పన, వినయ్, ప్రశాంత్, పూర్ణచందర్, సువర్చల, రచన, రైతులు పాల్గొన్నారు.
వైన్స్‌షాప్‌లకు 84 టెండర్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమ వారం వరకు 74 టెండర్లు దాఖలు కాగా.. మంగళవారం మరో 10 దరఖాస్తులు తమకు అందాయని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 84 దరఖాస్తులు అందాయని ఆయన వివరించారు. ఈనెల 18 ఆఖరుతేదీగా ఆయన పేర్కొన్నారు.

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు