
పారదర్శకంగా డీసీసీల నియామకం
ప్రజాభిష్టం మేరకే కాంగ్రెస్ పనిచేస్తుంది
ఏఐసీసీ పరిశీలకుడు జయకుమార్
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికకు మంథనిలో అభిప్రాయ సేకరణ
మంథని: కాంగ్రెస్ పార్టీ జిల్లా రథసారథుల నియామకం పారదర్శకంగా చేపట్టామని, కార్యకర్తల అభిష్టమేరయే నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ పరీశీలకు డు, మాజీ ఎంపీ జయకుమార్ తెలిపారు. డీసీసీ అ ధ్యక్షుడి ఎంపికకోసం మంథనిలోని లక్ష్మీనృసింహగార్డెన్‌లో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నా యకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. జయకుమార్ మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, బీజేపీ ప్రభుత్వంలో భద్రత కొరవడిందన్నారు. రాహుల్‌గాందీ జూడోయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని, ఒత్తిడి, భయానికి లోనుకాకుండా డీసీసీ ఎంపిక ఉంటుందని అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుపవచ్చన్నారు. ప్రభుత్వ సలహాదారు, పీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్క వేణుగోపాల్ మాట్లాడుతూ, జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పటిష్టంగా ఉందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.