
పోస్టుమార్టం చేయలేదని ధర్నా
పెద్దపల్లి – కాటారం రహదారిపై బైఠాయింపు
నాలుగు గంటలకుపైగా ట్రాఫిక్‌కు అంతరాయం
మంథని: ఖాన్‌సాయిపేట గ్రామ శివారులోని ఎల్‌మడుగులో మునిగి మృతి చెందిన గావిడి సూరి కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆందోళకు దిగారు. వీరికి బంధువులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. పాతపెట్రోల్ బంక్ కూడలిలో నిరసన తెలిపారు. 24 గంటలు గడిచినా మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదని బాధిత కుటుంబం ఆగ్రహించింది. పెద్దఎత్తున గ్రామస్తులు తరలిరావడంతో ఆందోళన ఉధృతరూపం దాల్చింది. సుమారు నాలుగు గంటలపాటు ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ తర్వాత ఆందోళనకారులు శాంతించారు.