
భయపెడుతున్న ప్లాస్టిక్
● ప్రమాదమని తెలిసినా ఆగని వినియోగం ● ప్రజల్లో కొరవడిన అవగాహన
మంథని: పాస్టిక్ వినియోగం ప్రమాదమని తెలిసినా పెద్దఎత్తున వినియోగిస్తూనే ఉన్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకడానికి ప్లాస్టిక్ ఒక ప్రధాన కారణమని వైద్యులు సూచిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. గ్రామాలు మొదలుకుని పట్టణాల్లోనూ చాలావరకు క్యాన్సర్ బాధితులు వెలుగులోకి వస్తున్నా.. ప్రజల్లో అవగాహన రాకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.
నిత్యజీవనం ప్లాస్టిక్‌తోనే..
నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ ని త్యం ఉపయోగించే వివిధ వస్తుసామగ్రి ప్లాస్టిక్‌తోనే ముడిపడి ఉంటొంది. పాలప్యాకెట్లు, కూరగాయలు, కాఫీ, టీకప్పులు, వాటర్‌బాటిళ్లు, బిందెలు, శుభకార్యాల్లో భోజనానికి ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులు వంటివి ప్లాస్టిక్‌వే దర్శనమిస్తున్నాయి. చివరకు తినుబండారాలు పార్సిల్ చేసే కవర్లు కూడా ప్లాస్టిక్‌వే కావడం గమనార్హం. పర్యావరణానికి ముప్పు అని తెలిసినా చాలా మంది వాడుతూనే ఉన్నారు.
ఆచరణలో అమలుకు నోచుకోని వైనం..
ప్లాస్టిక్ వస్తువులు వినియోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా ఆచరణలో విఫలమవుతున్నారు. ఒక్కోమనిషి ప్రతీరోజు 20 ప్లాస్టిక్ ప్యాకెట్లు వినియోగిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైందంటే వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ నేలలో కలిసిపోవడానికి కొన్నేళ్లు పడుతోందంటున్నారు. తద్వారా భూమిలో కాలుష్యం ఏర్పడి భూసారం తగ్గిపోతోంది. ఫలితంగా పంటలు సక్రమంగా పండవు. కరువు, కటకాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు.
అరటి ఆకులకు బదులు..
గతంలో శుభకార్యాల్లో భోజనానికి అరటిఆకులు వేసి వడ్డించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో లాభాల కంటే నష్టాలే అఽధికమని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కుళ్లిపోవు. రీసైక్లింగ్ చేస్తే క్లోరినేటేడ్ హైడ్రోకార్భన్లు, కార్బన్ డై ఆకై ్సడ్, కార్బన్ మోనాౖ క్సెడ్ వంటి వాయువులు విడుదలై వాతావరణం కలుషితమవుతుంది. జంతువులు తిన్నా జీర్ణంకావు. 20 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లు అత్యంత ప్రమాదకరమైనవని అంటున్నారు. పలుచగా ఉన్న ఈ కవర్లు దృఢత్వం కోసం అధిక మోతాదులో రసాయనాలు కలుపుతారు. ఈ కవర్లలో వేడి హానీ కలుగజేస్తుంది. లె డ్‌తో పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. మెర్క్యూరీ ఆర్సెనికోతో గుండె, నాడీ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయని వైద్యులు వివరిస్తున్నారు.
తయారీకి అనుమతిస్తూ.. వాడొద్దని చెబుతూ
ప్లాస్టిక్ తయారీకి ఒకవైపు అనుమతి ఇస్తూనే వినియోగించొద్దని చెప్పటం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమంటున్నారు. పర్యావరణ, అటవీ, సాంకే తిక శాఖ 2001 సంవత్సరంలో ప్లాస్టిక్ వాడకాన్ని ని షేధించాలని ఆదేశించాయి. వీటిప్రకారం ప్లాిస్టిక్ వా డితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశముంది. అలాగే 20 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్నవి, నల్లటి కవర్లు పూర్తిగా నిషేధం జాబితాలో ఉన్నా యి. జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీతోపాటు ఆయా మండల, గ్రామాల్లోని వ్యాపారుల వద్ద ఎక్కడచూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి.
కనుమరుగైన బుట్ట, బట్ట సంచులు
గతంలో చేతిలో బుట్ట లేదా బట్టసంచీ పట్టుకొని బ యటకు వెళ్లేవారు. కూరగాయలు, కిరాణా సామగ్రి తీసుకొచ్చేది. ఫ్రిజ్‌లు లేక తీసుకొచ్చిన సామాన్లు ఇంట్లోనే ఆరబెట్టుకునేది. ఇలా బుట్ట, బట్టసంచుల వినియోగం ఎక్కువగా ఉన్న సమయంలో అనా రోగ్య సమస్యలు సైతం తక్కువగానే ఉండేవి.