
‘థింక్.. షేర్ షేర్‌పై’ అవగాహన
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: థింక్..పేర్..షేర్ విధానంపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. మౌనంగా, చురుకుగాలేని విద్యార్థులను గుర్తించి ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రామగిరి, జూలపల్లి, ధర్మారం మండలాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. పాఠశాల అభివృద్ధి పనులకు ఎస్‌ఎంసీ తీర్మానం ఉండాలని అన్నారు. డ్రెయినీ డెప్యూటీ కలెక్టర్ వనజ, పీఆర్ ఈఈ గిరీశ్‌బాబు తదితరులు ఉన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని డిప్యూటీ సీఎం కలెక్టర్‌కు సూచించారు.