
ప్రజాస్వామ్య పద్ధతిన డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
పెద్దపల్లిరూరల్: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అ ధ్యక్ష ఎన్నిక పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని ఆ పార్టీ పరిశీలకుడు, మాజీఎంపీ జయకుమార్ అన్నారు. ఆసక్తిగలవారి నుంచి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించా రు. అయితే, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే లా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరుల స మావేశంలో మాట్లాడారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపించగల నాయకులను గుర్తించేందుకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకే డీసీసీ ఎన్నిక ఉంటుందని అ న్నారు. ఇందుకోసం జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందేలా చూడాలని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపితే పెండింగ్‌లో ఉంచి బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై నిందారోపణలు చేస్తు న్నారని ఎమ్మెల్యే విజయరమణారావు ధ్వజమెత్తా రు. సమావేశంలో నాయకులు వెంకటేశ్, రాజేశ్, బసిత్, రాజేశ్, దామోదర్‌రావు, ఆరె సంతోష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ప్రకాశ్‌రావు, స్వరూప, గండు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.